24.8 C
Hyderabad
Friday, July 31, 2026

భీంగల్ మున్సిఫ్ మేజిస్టేట్ కోర్టు ప్రగతి పనులను పరిశీలించిన జిల్లా జడ్జి భారత లక్ష్మీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . భీంగల్ లో మున్సిఫ్ కోర్టు ఏర్పాటు

 

. . . పునర్నిర్మాణం పనుల కోసం 30 లక్షల ఖర్చు అంచనా

 

. . . ఓల్డ్ ఐకేపీ భవనమే కోర్టు భవనంగా మారుతున్నది

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో మరో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు శరవేగంగా పునర్నిర్మాణం ప్రగతి పనులు జరుగుతున్నవి. నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిఎన్ భారత లక్ష్మీ బుధవారం ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి పి. శ్రీదేవి, ఆర్మూర్ బార్ అసోసియేషన్ కుదురుపాక ప్రవీణ్ చందర్ లతో కలిసి భీంగల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు భవన పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. భీంగల్ పట్టణంలోని ఓల్డ్ ఐకేపీ భవన్ ను కోర్టు ఏర్పాటుకు కేటాయించడంతో ప్రగతి పనులను జిల్లాజడ్జి భవనం అంత కలియ తిరుగుతు పలు సూచనలు చేశారు. పనులను త్వరగా ముగించి కోర్టు ప్రారంభానికి సిద్ధం కావాలన్నారు. పునర్నిర్మాణ పనులకు ఖర్చు ఎంత అయింది, ఇంకా ఎంత ఖర్చు చేయాల్సిన ఉందనే వివరాలు అడిగి తెలుకున్నారు. భీంగల్ న్యాయపరిధిలోని సిరికొండ, కమ్మర్ పల్లి, ఏర్గట్ల, మోర్తాడ్, వేల్పూర్ మండలాలలోని సివిల్ వివాదాలు, క్రిమినల్ కేసులు భీంగల్ కోర్టులో విచారణకు రానున్నాయి అని ఆమె అన్నారు. న్యాయార్థులకు దూరభారం తగ్గి కాలం కలిసివస్తుందని ఆమె అన్నారు. నిజామాబాద్ జిల్లా మొదట్లో బోధన్ కోర్టులు ఉన్నట్లు చివరలో భీంగల్ కోర్టు ఏర్పాటు ఉండటం శుభసూచకమేనని అన్నారు. ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుదురుపాక ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ దాదాపు 30 లక్షల అంచనాతో కోర్టు భవన పునర్నిర్మాణం పనులు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాజడ్జి భారత లక్ష్మీ పర్యటనలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ కోశాధికారి వడ్నాల రాజేందర్, న్యాయవాదులు శ్యామ్ యాదవ్, చిలివేరి సంజీవ్ తదితరులు ఉన్నారు.

 

District Judge Bharata Lakshmi inspected the progress of works at the Bheemgal Munsif Magistrate Court.

More articles

Latest article