. . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు వినియోగించుకుని చదువులో ముందు ఉండాలని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. బుధవారం జీపీఎస్ కోటగల్లి శంకర్ భవర్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి స్వయంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. భోజనం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలకు మున్సిపల్ నల్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్ సర్దార్ నరేందర్ సింగ్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ కైసర్, కరాటే రమేష్, ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్, ఉపాధ్యాయులు దయానంద్, మమత, ప్రసన్న, లక్ష్మి, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.
