26.3 C
Hyderabad
Monday, August 3, 2026

రోడ్డు ప్రమాద బాధితుడిని కలెక్టర్ వాహనంలో ఆస్పత్రికి తరలింపు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మానవత్వం చాటుకున్న కలెక్టర్

 నిజాంసాగర్, బతుకమ్మ :

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ని వెంటనే వాహనంలో ఆస్పత్రికి తరలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తన మానవత్వం చాటుకున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ నిజాంసాగర్ -మాగి మధ్యలో ఆటో, బైక్ డీ కొట్టిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ని మానవత్వంతో స్పందించి వాహనంలో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వివిధ మండలాల్లో కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ వెళ్తుండగా, మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద కోడ్‌పగల్‌లో ఓటు వేసి తిరిగి వస్తున్న సమయంలో ఆటో, బైక్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తికి తక్షణ సహాయం అందించి, ఎలాంటి ఆలస్యం చేయకుండా వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్ తీరును పలువురు అభినందించారు.

Road accident victim taken to hospital in collector's vehicle

More articles

Latest article