. . . మానవత్వం చాటుకున్న కలెక్టర్
నిజాంసాగర్, బతుకమ్మ :
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ని వెంటనే వాహనంలో ఆస్పత్రికి తరలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తన మానవత్వం చాటుకున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ నిజాంసాగర్ -మాగి మధ్యలో ఆటో, బైక్ డీ కొట్టిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ని మానవత్వంతో స్పందించి వాహనంలో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వివిధ మండలాల్లో కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ వెళ్తుండగా, మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద కోడ్‌పగల్‌లో ఓటు వేసి తిరిగి వస్తున్న సమయంలో ఆటో, బైక్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తికి తక్షణ సహాయం అందించి, ఎలాంటి ఆలస్యం చేయకుండా వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్ తీరును పలువురు అభినందించారు.
