27.8 C
Hyderabad

దేశంలో రిచ్ బిజినెస్ మెన్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రూ.271 కోట్లకు పెంట్ హౌస్ కొన్న మానవ్ సర్ధానా

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

భారతదేశంలో ఎందరో సంపన్నులు ఉన్నారు. వేల కోట్ల ఆస్తులు కలిగిన వాళ్లు, వందల కోట్ల వ్యాపార సామాజ్రాన్ని నడిపిస్తున్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఓ వ్యక్తి పేరు బాగా వినిపిస్తోంది. నిన్నటి వరకు ఓ ఖరీదైన ఇంటి గురించి జరిగిన చర్చ ఇప్పుడు దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరూ..? అతని ప్రొఫైల్ ఏంటని వెదుకుతున్నారు. అతని పేరే మానవ్ సర్దానా. ఈ ఫేమస్ బిజినెస్‌మెన్ ఎవరో తెలియాలంటే ఆయన రిచ్ టేస్ట్ గురించి ముందు తెలుసుకోవాలి.

హర్యానా రాజధాని గుర్గావ్‌లో ఈమధ్య కాలంలో భారీ ధరకు అమ్ముడైన ఓ ప్లాట్ గురించి దేశం అంతా చర్చించుకుంది. ఏంటీ నిజంగా ఓ లగ్జరీ ప్రాజెక్టులోని పెంట్ హౌస్‌ని అక్షరాల రూ.271 కోట్ల రూపాయలకు అమ్ముడైందన్న వార్త ఇప్పటికి వైరల్ అవుతోంది. అయితే గుర్గావ్‌లోని ప్రెస్టేజియస్ వెంచర్‌ డీఎల్ఎఫ్ సంస్థ 2024 అక్టోబర్‌లో ‘ది డాలియాస్’ ప్రాజెక్టును ప్రారంభించింది. గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ ఫేజ్ 5లో నిర్మించిన ఈ హై వాల్యూ హౌసింగ్ కమ్యూనిటీలో ఒక్క పెంట్ హౌస్ కొనుగోలు చేసిన వ్యక్తే మానవ్ సర్దానా. ఒక్క పెంట్ హౌస్‌ని 271 కోట్లు ఖర్చు చేశాడంటే అతను ఎవరై ఉంటారు..? అతని ఆర్ధిక మూలాలు, వ్యాపార సముదాయాలు, ఆస్తి, పాస్తులు ఏంటనే దానిపై వివరాలు రాబడితే కొన్ని జాతీయ మీడియాలు మానవ్ సర్దానా గురించి మనకు తెలియని చాలా విషయాలు బయటకు వచ్చాయి. మానవ్ సర్దానా ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. అతను మాత్రమే కాదు శతాబ్ధాల బిజినెస్ హిస్టరీ కలిగిన సర్దానా ఫ్యామిలీకి చెందిన వారసుడే మానవ్ సర్దానా. మానవ్ సర్దానా తండ్రి ఎస్‌బీ సర్దానా 1969లో ఇంపీరియల్ ఆటో ఇండస్ట్రీస్ సంస్థను నెలకోల్పి బాగా పాపులర్ అయ్యారు. ఆటోమొబైల్ రంగానికి అవసరమైన పరికరాలను తయారు చేసే ఈ సంస్థ దేశంలోనే కీలక సంస్థగా మారిపోయింది. గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్ పింకస్ దీన్ని కొనుగోలు చేయడానికి ముందే మానవ్ సర్దానా ఇంపీరియల్ ఆటోలో భాగస్వామిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ గ్రూపునకు చెందిన అనేక కంపెనీలకు మానవ్ సర్దానా డైరెక్టర్‌గా, వెరీ రిచ్ అండ్ బిజీ బిజినెస్‌మెన్‌గా ఉన్నాడజనుకు పైగా కంపెనీలలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇక మానవ్ సర్దానా కొనుగోలు చేసిన వెరీ కాస్ట్లీ పెంట్ హౌస్ విషయానికి వస్తే .. ఒక సింగిల్ లివింగ్ హౌస్ కోసం రూ.271 కోట్లు ఖర్చు చేశారంటే దాని ప్రత్యేకత గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని సెక్టార్ 54లో ఉన్న ఈ పెంట్‌హౌస్ సూపర్ ఏరియాగా నిర్మించారు. డీఎల్ఎఫ్ ది డాలియాలో 17,200 చదరపు అడుగులు కాగా, కార్పెట్ ఏరియా దాదాపు 10,500 చదరపు అడుగులుగా ఉంది. ఈ డీల్ విలువ ప్రకారం.. సూపర్ ఏరియా లెక్కన చదరపు అడుగుకు రూ. 1.58 లక్షలు, కార్పెట్ ఏరియా ప్రకారం చదరపు అడుగుకు రూ. 2.6 లక్షల రికార్డు ధర ఉంటుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. 17 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్న ఈ లగ్జరీ లివింగ్ స్పేస్‌లో సుమారు 420 అపార్ట్‌మెంట్లు, పెంట్‌హౌస్‌లు ఉన్నాయి. ఒక్కో అపార్ట్‌మెంట్ ధర రూ. 100 కోట్ల నుంచి రూ. 170 కోట్లు పలుకుతోందని జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ఇక పెంట్‌హౌస్‌ల రేట్లు అంతకు మించిన డిమాండ్ ఉన్నట్లుగా మానవ్ సర్దానా కొనుగోలు చేసిన దాన్ని బట్టి చూస్తే అర్ధమవుతోంది. మొత్తం ఈ ప్రాజెక్టు ద్వారా రూ. 40,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని డీఎల్ఎఫ్ అంచనా వేస్తోంది. పీటీఐ కథనం ప్రకారం, ఇప్పటికే 65% యూనిట్లు అమ్ముడయ్యాయి. కరోనా మహమ్మారి తర్వాత దేశంలోని ప్రధాన నగరాలైన గురుగ్రామ్, ముంబైలలో విలాసవంతమైన గృహాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. సంపన్న కొనుగోలుదారులు పెద్ద, ప్రత్యేకమైన ఇళ్లను కోరుకుంటున్నారని ఈ భారీ డీల్ స్పష్టం చేస్తోంది.

More articles

Latest article