27.4 C
Hyderabad

భిక్కనూరు ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన సవిత

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూర్, బతుకమ్మ :

 

భిక్కనూరు మండల ఎంపీడీవోగా సవిత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటానని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article