29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బీసీల ఆత్మగౌరవంతో రేవంత్ రెడ్డి ఆడుకున్నాడు

Must read

📰 Generate e-Paper Clip

  • బీసీల రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు
  • చేతకాని పాలనను కప్పిపుచ్చుకునేందుకే డ్రామాలు
  • కల్వకుంట్ల కుటుంబంతో ఉన్న ఒప్పందాలు బయటపడొద్దని రేవంత్ వేషాలు
  • నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్

 

హైదరాబాద్, బతుకమ్మ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, చేతకానీ పాలనను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి బీసీల ఆత్మగౌరవంతో ఆడుకున్నాడని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణ చేశారు. హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై, స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే ఇచ్చిన తర్వాత నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఏనాడు బీసీలపై ప్రేమలేదని, చిత్తశుద్ది అసలే లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రం మొదలుకుని 2027 వరకు 80 ఏళ్ళలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క బీసీ నాయకుడు ముఖ్యమంత్రి చేయలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీల స్కీంల వాగ్ధానాలు నెరవేరుస్తాం, ఆదాయం సృష్టిస్తామన్నారు. అయితే బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని వారిని బకరా చేశాడని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది లేదని తెలిపారు. ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రిజర్వేషన్లు ఇప్పించిందని గుర్తు చేశారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇస్తానని మాట ఇచ్చిన నరేంద్రమోడికి చిత్తశుద్ది ఉంది కాబట్టి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చాడన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబం మధ్య ఉన్న ఒప్పందాలు బహిర్గతం అవుతాయని బీసీల రిజర్వేషన్ల అంశాన్ని రేవంత్ రెడ్డి ఎత్తుకున్నాడని అన్నారు. రాజ్యాంగ సవరణ జరుగకుండా బీసీలకు రిజర్వేషన్లు సాధ్యం కాదన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్ ను ఎందుకు లోపల వేయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిధుల పెంపుదల వెనుక కమిషన్ కోసమేనని కమిటీ రిపోర్టు ఇచ్చినా ఎందుకు చర్య తీసుకోలేదన్నారు. కవిత రాజీనామా స్పీకర్ ఫార్మెట్ లో చేసినా ఎందుకు ఆమోదించలేదో, కవితకు రేవంత్ కు దోస్తానా ఏమిటని నిలదీశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్, టానిక్ లో జీఎస్టీలలో అక్రమాలు జరిగాయని పదే పదే చెప్పినా రేవంత్ రెడ్డి విచారణ సంస్థలు నివేదికలు ఇచ్చినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు ఎందుకు జైలుకు పంపకపోవడానికి ఇధ్దరి మధ్య ఒప్పందమే కారణమన్నారు.

Revanth Reddy played with the self-respect of BCs

More articles

Latest article