సిరిసిల్ల, బతుకమ్మ : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లను హౌస్ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ భారత రాష్ట్ర సమితి నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, “ప్రజల పక్షాన నిలిచే నాయకులను అర్ధరాత్రి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.“ఆర్టీసీ బస్సు చార్జీలను 50 శాతం పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ నాయకత్వంలో ఆర్టీసీ భవన్ వద్ద వినతిపత్రం ఇవ్వడానికి ముందే నాయకులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ప్రజల పక్షాన నిలిచిన వారిని చూసి భయపడటం కాంగ్రెస్ ప్రభుత్వ బలహీనతకు నిదర్శనం”అని అన్నారు.హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాకపోవడంపై కక్ష సాధింపులు మొదలుపెట్టిందని ఆర్టీసీ కార్గోను ప్రైవేట్ పరం చేయడం, బస్సు చార్జీలు పెంచడం ప్రజలకు భారంగా మారిందన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజా పాలన?” అని ప్రశ్నించారు. “ఆర్టీసీని లాభాల దిశగా తీసుకువెళ్లిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కార్గో సేవలను ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వడం ప్రజా వ్యతిరేక చర్య” అని అన్నారు.“ఎన్ని అరెస్టులు చేసినా బిఆర్ఎస్ వెనుకాడదని కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మట్టి శ్రీనివాస్, శివరాం, అడిచర్ల సాయి, గాజుల మహేష్, సంపత్, వెలమల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
