27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

26నుంచి తీర్థయాత్రలకు ప్రత్యేక రైలు

Must read

📰 Generate e-Paper Clip

  • ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పివి.వెంకటేష్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తీర్థయాత్రలకు అక్టోబర్ 26 నుండి నవంబర్ 04 వరకు ప్రత్యేక రైలు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అందుబాటులో ఉంటుందని ఐఆర్సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పివి.వెంకటేష్ తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం నిర్వహించిన విలేకరలు సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ నుండి జనవరి వరకు దేశీయ ఎయిర్ ప్యాకేజ్ హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్థయాత్రలో భాగంగా దర్శించే ప్రదేశాలు ద్వారకాదీష్ మందిరము, నాగేశ్వర జ్యోతిర్లింగ మందిరము, బేట్ ద్వారక, సోమనాథ్ జ్యోతిర్లింగ మందిరము, సబర్మతి ఆశ్రమము. సూర్యదేవాలయం, రాణికి వావ్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం). సామాన్యులకు అందుబాటు ధరను నిర్ణయించామని తెలిపారు. రైలు, బస్సు, హెూటల్, అన్నీ భోజనాలు (ఉదయం అల్పాహారం, మధ్యహ్నం, రాత్రి భోజనం, వాటర్ బాటిల్) టూర్ ఎస్కార్ట్ సేవలతో సందర్శనా స్థలాలు, ప్రయాణ బీమా ఉంటుందన్నారు. రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగా ఉచితమని, ప్రతి రైలు లో 639 మంది ప్రయాణికులు ఉంటారని తెలిపారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకార్యలు సమకురుస్తారన్నారు. కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్, ప్రయాణ బీమా అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని నిజామాబాద్ జిల్లా ప్రజలు ఉపయోగించు కోవాలని అన్నారు. అలాగే టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు 9701360701, 9281030711, 9281030733,9281030749లకు సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరణలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రదించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఐఆర్సీటీసీ – టూరిజం మార్కెటింగ్ ఇంచార్జ్ నరేశ్ బాబు ఓర్సు  పాల్గొన్నారు.

More articles

Latest article