26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఓటుకు నోటు కేసుతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న రేవంత్

Must read

📰 Generate e-Paper Clip

  • పదవుల కోసం పెదవులు మూసుకుంటున్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు
  • బనకచర్ల విషయంలో చంద్రబాబు, బీజేపీలకు వత్తాసు పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి

 

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : మాయల ఫఖీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్లు ఓటుకు నోటు కేసులో సీ. ఎం రేవంత్ రెడ్డి జుట్టు ఆంధ్ర సీ. ఎం చంద్రబాబు చేతిలో ఉండడం మూలన బనకచర్ల విషయంలో రేవంత్ తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఎమ్మెల్యే బతుకమ్మ తో మాట్లాడుతూ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయానా అటు చంద్రబాబు కు ఇటు కేంద్రం లో ఉన్న బీజేపీ కి వత్తాసు పలుకుతుండగా, అటు రాష్ట్రం నుండి గెలిపించిన బీజేపీ ఎం.పీలు పదవుల కోసం పెదవులు మెదపడం లేదని ఆయన విమర్శించారు. బనకచర్ల విషయం లో తను ఢిల్లీకి వెళ్ళాను అని పగలు చెప్పిన సీ. ఎం రేవంత్ రాత్రికి రాత్రే మనుసు మార్చుకొని ఢిల్లీ వెళ్లి బనకచర్ల మీద వేసిన కమిటీని ఒప్పుకోవడంలో అంతర్యామేమిటని ఆయన ప్రశ్నించారు. బనకచర్ల విషయంలో చంద్రబాబు, లోఖేష్ ల వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ బీజేపీ ఎం.పిల చేతకాని తననానికి నిదర్శనమన్నారు. బనకచర్ల విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం,  ఇటు చంద్రబాబులు సీ. ఎం రేవంత్ రెడ్డిని పావుల వాడుకుంటున్నారని ఆయన అన్నారు. పథకం ప్రకారమే కేంద్ర బీజేపీ ప్రభుత్వం,చంద్రబాబు లు బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నట్లు లోకేష్ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయని అన్నారు. బనకచర్ల ఎజెండాలో లేదని, కడతామంటేనే కాదని అడ్డు చెప్పేది  సీ.ఎం రేవంత్ రెడ్డే చెప్పారని, మరి ఏ. పి మంత్రి లోకేష్ మాట్లాడిన మాటలకు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. బనక చర్ల ప్రాజెక్ట్ ఎలాగైనా కట్టి తీరుతాం అంటున్న లోకేష్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు ఇప్పటిమట్టుకు స్పందించకపోవడం తో అసలు లోగుట్టు బయట పడిందన్నారు. రేవంత్ రెడ్డి తన  గురువు చంద్రబాబు మెప్పుకోసం అలాగే కేంద్రం దగ్గర తన స్వప్రయోజనాల కోసం తెలంగాణ ను తాకట్టు పెడుతున్నాడని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ కు అన్యాయం చేసే బనక చర్ల ప్రాజెక్ట్ ను  అడ్డుకుంటామని, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ పోరాడేది కేసీఆర్ నని,బీయర్ ఎస్ పార్టీ మాత్రమేనని, ఏనాటికైనా తెలంగాణ కు కేసీఆరే శ్రీరామ రక్ష అని అన్నారు. బనక చర్ల ప్రాజక్ట్ విషయంలో బీజేపీ ,చంద్రబాబు,రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి తెలంగాణ కు చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు,ముఖ్యంగా యువతకు అవగాహన కల్పిస్తామని ప్రశాంత్ రెడ్డి అన్నారు.

More articles

Latest article