27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మద్యం మత్తులో డయల్-100 కు పదేపదే కాల్స్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇద్దరికి 7 రోజుల జైలు శిక్ష

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

రెండు రోజుల క్రితం 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రి నగర్ గ్రామానికి చెందిన గంపల లక్ష్మణ్, సంపంగి బాలాజీలు మద్యం మత్తులో బహిరంగంగా న్యూసెన్స్ సృష్టించడంతో పాటు డయల్-100కు పదేపదే ఫోన్ చేసి పోలీసు సేవలను దుర్వినియోగం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన 6వ టౌన్ పోలీసులు ఇద్దరిపై పెట్టీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం వారిని బుధవారం నిజామాబాద్ స్పెషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్, గంపల లక్ష్మణ్, సంపంగి బాలాజీలకు చెరో 7 రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి చర్యలు అత్యవసర పోలీసు సేవలకు ఆటంకం కలిగిస్తాయని, డయల్-100 వంటి అత్యవసర సేవలను ప్రజలు బాధ్యతాయుతంగా వినియోగించాలని పోలీసులు సూచించారు.

More articles

Latest article