- తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంజర భూమయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంజర భూమయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా 3వ మహాసభలు సోమవారం నిజామాబాద్ నగరంలోని రైస్ మిల్ ఫీట్టర్ యూనియన్ ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథి కంజర భూమయ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి మోడీ సర్కార్ అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తుందన్నారు. గతంలో మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చి 750 మంది రైతుల ప్రాణాలు బలితీసుకుందని తెలిపారు. దొంగచాటుగా ఆర్డినెన్స్ పేరుతో వ్యవసాయ మార్కెట్ నూతన విధానాన్ని తీసుకొస్తున్నదని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఎస్ కే యం ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 11న ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

