- రూ.30.80 కోట్ల చెల్లింపులు
- 6,568 మంది రైతులకు ప్రయోజనం
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో సన్నరకం వడ్లు పండించిన రైతులకు బోనస్ విడుదల చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖా అధికారులు తెలిపారు. సోమవారం వరకు నిజామాబాద్ జిల్లాలో 6,568 మంది రైతులు పండించిన 6,16,110 క్వింటాళ్ల సన్న రకం ధాన్యంకు సంబంధించి రూ.30 కోట్ల 80 లక్షల 55 వేలు విడుదల అయ్యాయి. వానకాలంలో జిల్లాలో సోమవారం వరకు 8,578 మంది రైతులు 7,88,714 క్వింటాళ్ల సన్నరకం వడ్లను పండించారు. వారికి రూ.45 కోట్ల, 56 లక్షల,84 వేల,200 రూపాయలు చెల్లించాలి. ప్రభుత్వం నిర్ణయించిన సన్నరకం ధాన్యంకు ఏ గ్రేడ్ రకానికి 2380, బీ గ్రేడ్ రకానికి రూ.2360 చెల్లించిన తరువాత క్వింటాళ్ కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో వరి కోతలు ప్రారంభమై రైతుల పంటలు చేతికి వచ్చిన సమయంలో అకాల వర్షాల కారణంగా కొనుగోళ్లకు విఘాతం కలిగింది. వారం రోజులుగా ధాన్యం సేకరణ మద్ధతు ధర ప్రకారం జరుగక ట్యాబ్ ఎంట్రీ జరుగలేదు. దానితో జిల్లాలో మరో 15 కోట్ల చెల్లింపులు ఆగినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో గత సీజన్ కు సంబంధించి రైతులకు సన్నాలకు పండించినందుకు రూ.449 కోట్ల బోనస్ చెల్లించలేదు.
