- ఆర్థిక పరిస్థితికి కారకులెవరు
- స్టేట్ కోపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
కమ్మర్ పల్లి, బతుకమ్మ : గడిచిన పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీయర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులపై, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో చేసిన అభివృద్ధి పనులపై చర్చకు సిద్దమని ప్రజా వేదిక ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బహిరంగ చర్చక రావాలని డీ సీ సీ ప్రెసిడెంట్, స్టేట్ కోప్రటివ్ కార్పొరేషన్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ సుంకేట రవి అధ్యక్షతన నిర్వహించి ప్రెస్ మీట్ ఆయన మాట్లాడుతూ సీ ఎం రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆ ఆరోపణలు తన అహంకార, అవివేక రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా చేసి మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రశాంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడిన ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప సలహాలు, సూచనలు ఇచ్చింది లేదన్నారు. బీయర్ఎస్ గవర్నమెంట్ ఆర్ధిక వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను విచ్చిన్నం చేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థను సరి చేసుకుంటూ ముందుకు వెళ్తోందని అన్నారు. తనకు వత్తస్సు పలికే కొందరు ఉద్యోగులతో ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తే, ఉద్యోగులకు తను చాలా చేసాను అనే ఉద్దేశంతో సీ ఎం ఆలా మాట్లాడరని అన్నారు. గతంలో బీయర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులను గేటు ముందర నిలబెడితే, ప్రస్తుతం రేవంత్ రెడ్డి మున్నాలుగు సార్లు ఉద్యోగులతో చర్చలు జరిపిన మాట వాస్తవం కాదా అని అన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల సీ ఎం కు సానుభూతి ఉందని, రాష్ట్ర ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆలా మాట్లాడరని అన్నారు. గతంలో బీయర్ఎస్ హయాంలో ఆర్ధికంగా విచ్చిన్నం అవుతున్న సందర్బంలో కాబినెట్ లో ఉన్న కేటీయర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు ఎందుకు భాద్యత వహించడం లేదని అన్నారు. ప్రశాంత్ రెడ్డి తప్పుడు మాటలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే గ్రామాల్లో తిరుగకుండా చేస్తామన్నారు. ఎమ్మెల్యే కు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఏ విషయంలో విఫలం అయ్యిందో చెప్పాలనుకుంటే చర్చకు వేదిక నిర్ణయించి చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ ప్రెస్ మీట్ లో రాష్ట్ర ఎన్. ఎస్. యు. ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెం నరసయ్య,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భూచయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడేమ్ గంగాప్రసాద్,కిషన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్,బూచి మల్లయ్య, సుంకేట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
