24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మత్తమాల పీ హెచ్ సీ తనిఖీ చేసిన ఆర్డీఓ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల పీహెచ్ సి ని ఆర్డిఓ పార్థ సింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీకి వచ్చే రోగుల వివరాలు, అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని రికార్డులు, మందులను పరిశీలించారు. వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని తెలిపారు. అనంతరం జంగమయ్యపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ మండలంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. చాలా మంది నిరుపేదలు త్వరగా ఇల్లు నిర్మిం చడానికి ఉత్సాహంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇళ్లను నిర్మించుకున్న వారికి వెంటనే బిల్లులు వచ్చే విధంగా చూస్తామని అన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో ప్రకాష్, కాంగ్రెస్ నాయకుడు వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RDO inspects Mattamala PHC

More articles

Latest article