మత్తమాల పీ హెచ్ సీ తనిఖీ చేసిన ఆర్డీఓ

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల పీహెచ్ సి ని ఆర్డిఓ పార్థ సింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీకి వచ్చే రోగుల వివరాలు, అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని రికార్డులు, మందులను పరిశీలించారు. వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని తెలిపారు. అనంతరం జంగమయ్యపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ మండలంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు...