మత సామరస్యానికి ప్రతీక రంజాన్

0 1,572
  • ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్

 

రుద్రూర్, బతుకమ్మ : మతసామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో  కాసుల బాల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మతసామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో తహసిల్దార్ తారాబాయి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, ఇమ్రాన్, షేక్ నిస్సార్, ఫరీద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.