24.7 C
Hyderabad
Monday, August 3, 2026

‘‘బార్”అధ్యక్షునిగా సాయరెడ్డి ఏకగ్రీవం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా సీనియర్ న్యాయవాది మామిల్ల సాయరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారులు జె.వెంకటేశ్వర్,ఆర్.ఎస్.ఎల్ గౌడ్ ,ఎర్రం విగ్నేష్, బిట్ల రవి,మధుసూదన్ గౌడ్ తెలిపారు. నామినేసన్ల స్వీకరణ, పరిశీలన అనంతరం సాయరెడ్డి ఒకరే నామినేషన్ వేశారని,నామినేషన్ పత్రాలను పరిశీలించిన పిదప ,ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఉన్నందున ఆమోదించి అధ్యక్ష ఎన్నికను దృవీకరించినట్లు వారు తెలిపారు. ఉపాధ్యక్ష పదవికి సురేష్, దిలీప్, ప్రధాన కార్యదర్శి పదవికి మానిక్ రాజు, భాస్కర్ రెడ్డి, బాలరాజ్ నాయక్, సంయుక్త కార్యదర్శి గా ఝాన్సీరాణి, సత్యనారాయణ గౌడ్ ల నామినేషన పత్రాలు సక్రమంగా ఉన్నందున ఆమోదించామని తెలిపారు. అట్టి పదవులకు ఎప్రిల్ 11 న ఎన్నికలు నిర్వహిస్తామని వారు వెల్లడించారు.

సాయరెడ్డి నేపథ్యం…

వర్ని మండలం చందూర్ గ్రామానికి చెందిన మామిల్ల సాయరెడ్డి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల విద్యాబ్యాసం చందూర్ లొనే కొనసాగింది. నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి, ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ ఉత్తీర్ణులయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1995  సంవత్సరంలో న్యాయశాస్త్ర పట్టభద్రులై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ లో 1996 లోన్యాయవాదిగా పేరు  నమోదు చేసుకుని, నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యత్వం తీసుకుని న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. యువజన కాంగ్రెస్ లో పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మాజీమంత్రి, దివంగత ఇంద్రారెడ్డి తెలంగాణ ఉద్యమ సమితిలో కీలకపాత్ర పోషించారు. అనంతరం టి.ఆర్.ఎస్ లో చేరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తో కలిసి నడిచారు. కొన్నేళ్లకు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజెందర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేష్, కృపాకర్ రెడ్డి,రాజ్ కుమార్ సుబేదార్, రాజలింగం,కృష్ణనంద్, రమాగౌడ్,కుమార్ దాస్,వి.భాస్కర్, ఎర్రం గణపతి తదితరులు సాయరెడ్డి కి హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.

Sayareddy unanimously elected as the president of the "Bar"

More articles

Latest article