ఆర్మూర్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య శుక్రవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం కృషి చేయాలి అని అన్నారు. గల్ఫ్ కు పంపుతాము అనే ఏజెంట్ ల పైన పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలని, వారి ద్వారా నిరుద్యోగ యువత మోసపోకుండా చూడాలని అన్నారు. వీడీసీ ల పట్ల కఠినంగా ఉండాలని, ఎవరు కూడా చట్టాన్ని వారి చేతులోకి తీసుకోకుండా చూడాలని , శాంతభద్రతలకు విఘాతం కలిగించేవారిని ని ఉపేక్షించ రాదని హెచ్చరించారు. రిసిప్షన్ సెంటర్ పనితీరును , కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ జె. వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్ఎచ్ఓ పి.సత్యనారాయణ గౌడ్, ఎస్ఐలు మహేష్ , ఇంద్రకరణ్ రెడ్డి లు పాల్గొన్నారు.
