బతుకమ్మ ,ఏర్గట్ల : జడ్పీహెచ్ఎస్ ఏర్గట్ల లో భౌతిక శాస్త్రంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా బోధన చేసే గాండ్ల రాజశేఖర్ ని ఈ సంవత్సరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేశారు. అస్సాం రాష్ట్రంలోని ఐఐటి గౌహతిలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్-2024 లో దేశం మొత్తం మీద తీసుకున్న 4 ప్రసెంటేషన్ లలో రాష్టం నుండి పాల్గొన్న ఒకే ఒక ఉపాధ్యాయుడిగా మన నిజామాబాద్ జిల్లా పేరు ను మరియు జడ్పీహెచ్ఎస్ ఏర్గట్ల పాఠశాల ఖ్యాతిని ఉన్నత స్థానానికి తీసుకపోయారు. అలాగే హైదరాబాద్ లో జరిగిన సైన్స్ అకాడమీ మరియు టెక్ మహీంద్రా నిర్వహించిన శిక్షణ కార్యక్రమం లో పాల్గొని గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అలాగే సౌత్ ఇండియా ఐకానిక్ అవార్డ్ 2024 నీ కూడా పొందారు. వీరి శ్రద్ధగల బోధనశైలి, మరియు పాఠశాలలో విద్యార్థులలో విజ్ఞానానికి చూపిన రకరకాల ప్రయోగాలు బోధన కారణంగా ఈ గౌరవం పొందడం ప్రత్యేకమైన ఘనత. ఈ ఎంపిక ఉపాధ్యాయుని వ్యక్తిగత ప్రతిభను మాత్రమే కాకుండా, పాఠశాల జిల్లా విద్యా రంగానికి గర్వకారణంగా నిలుస్తుందనీ పి ఆర్ టి యు ఏర్గట్ల మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు ఆయన కృషిని తెలియజేస్తూ ప్రశంసించారు.
