27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

చలి తీవ్రతపై ఇంటింటికి తిరుగుతూ అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని గంగారం తండా గ్రామంలో శుక్రవారం అంగన్వాడి టీచర్, శారద, ఆశ వర్కర్ జ్యోతి లు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆరోగ్యం జాగ్రత్త అంటూ పలు సూచనలు చేశారు. చలి తీవ్రత గత రెండు మూడు రోజులుగా ఎక్కువ ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.అవసరముంటే గాని బయటకు వెళ్ళవద్దని సూచించారు.ఎవరికైనా జలుబు, దగ్గు,దమ్ము,ఉన్నట్లయితే ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు.ప్రతిరోజు ఉదయం సాయంత్రం గోరువెచ్చటి నీరు తీసుకోవడం వల్ల దగ్గు దమ్ము జలుబు వంటి వాటిని నిర్మించవచ్చని సూచించారు అనంతరం ప్రజలకు, పారాసెటమాల్, డైక్లోపెనిక్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర గోళీలు అందజేశారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చలికాలంలోనే దోమలు ఎక్కువగా ఉంటాయని దీనివల్ల మలేరియా ఫైలేరియా డెంగ్యూ వంటి జ్వరాలు రావడం జరుగుతుందని సూచించారు. ఇండ్లలో కొందరు కుళాయిలలో నీటిని ఎప్పటికప్పుడు నిలువ లేకుండా శుభ్రపరుస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శారద,ఆశ వర్కర్ పాశం జ్యోతిలు ఉన్నారు.

Raising awareness about the severity of the cold by going door to door

More articles

Latest article