28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రమాదాల నివారణ సూచిక బోర్డులు ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోనిలో చంద్రాయన్ పల్లి  పరిధిలో గల హైవే రోడ్డుకు ట్రాఫిక్ పోలీస్ వాహనం గుర్తుతోపాటు నెమ్మదిగా వెళ్ళుము అనే సూచిక బోర్డులు నిజామాబాద్ కమిషనరేట్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య ఆదేశాల మేరకు రోడ్డు పక్కన సూచిక బోర్డులు పెట్టడం జరిగిందని ఎస్ఐ సందీప్ తెలిపారు. హైవే రోడ్డుపైన వెళుతున్న వాహనదారులు ఈ యొక్క సూచిక బోర్లు చూసి వాహనాలను నెమ్మదిగా వెళ్లే విధంగా సూచిక బోర్డులు పెట్టడం జరిగిందన్నారు. పెట్రోలింగ్ వాహనం అక్కడ ఉన్నట్లుగా నెమ్మదిగా పొమ్మన్నట్లుగా సూచికలు ఏర్పాటు చేశారు. దీంతో దీంతో ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి,ప్రమాదాల నివారణ కొరకు, ప్రయాణికుల యోగక్షేమల కొరకు ఈ బోర్డులు హైవే రోడ్ ప్రక్కన పెట్టడం జరిగిందన్నారు.దీనిని కొందరు యువకులు తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సూచిక బోర్డు పైన తప్పుడు ఆరోపణలు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై జి సందీప్ తెలిపారు. ప్రజల ప్రయాణాలను సురక్షితంగా కాపాడాలని భావంతోనే ఈ సూచిక బోర్డును పెట్టడం జరిగిందన్నారు. చంద్రంపల్లి గ్రామ పరిధిలో గల హైవే ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు ఎక్కువ జరుగుతుండడం వల్ల ఈ సూచిక బోర్డులు పెట్టడం జరిగిందన్నారు. కొందరు ఆకతాయి యువకులు బోర్డు ఉండడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని దీనిని అసత్య ప్రచారాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అగంతకుల మాటలు ఎవరు నమ్మవద్దని ఎస్ఐ జి సందీప్ తెలిపారు.

More articles

Latest article