చలి తీవ్రతపై ఇంటింటికి తిరుగుతూ అవగాహన

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని గంగారం తండా గ్రామంలో శుక్రవారం అంగన్వాడి టీచర్, శారద, ఆశ వర్కర్ జ్యోతి లు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆరోగ్యం జాగ్రత్త అంటూ పలు సూచనలు చేశారు. చలి తీవ్రత గత రెండు మూడు రోజులుగా ఎక్కువ ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.అవసరముంటే గాని బయటకు వెళ్ళవద్దని సూచించారు.ఎవరికైనా జలుబు, దగ్గు,దమ్ము,ఉన్నట్లయితే ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు.ప్రతిరోజు ఉదయం సాయంత్రం గోరువెచ్చటి నీరు తీసుకోవడం...