- జాగృతి నాయకులు అవంతి రావు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బల్మూరి వెంకట్ ముందు నీ గ్రామంలో నీ నిజాయితీ నిరూపించుకో అనితెలంగాణ జాగృతి నాయకులు అవంతి రావు సవాల్ విసిరారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్యాల మండలం మానాల గ్రామంలో దళితులు,ఇతరుల భూములు లాక్కోలేదా అని ఆరోపించారు. ఎదిరిస్తే బస్సుల్లో ఎన్ ఎస్ యూ ఐ కార్యకర్తలను జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామంలో నీ చెంచాలను దింపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మానాల శివారులో నీ ఫామ్ హౌస్ (మొన్న మొన్న కట్టిన) వేదికగా రాజకీయాలు,సెటిల్మెంట్లు చేస్తుంది వాస్తవమా కాదా అని అన్నారు. మా భూమి మాకివ్వండని రోడ్డెక్కితే.. తిరగబడితే పంచాయితీ తెంపాలని.. జగిత్యాల నుండి పార్టీ మారిన ఎమ్మెల్యే తో మధ్యవర్తి ద్వారా బేరానికి వచ్చింది వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. అదే కబ్జా భూమిని ప్రభుత్వానికి దానం చేస్తానని ప్రగల్భాలు పలికింది నిజమా కాదా…దమ్ముంటే నీ సొమ్ముతో సంపాదించిన భూమి దానం చెయ్యి అని సవాల్ విసిరారు. పేదోళ్ల పొట్టకొట్టి తీసుకున్న భూమి ఉత్తపుణ్యానికి ప్రభుత్వానికి ఇస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పులి జైపాల్, శ్యామల సాయి కృష్ణ, పంచ రెడ్డి మురళి, సరిత ,హరీష్, సంపత్, ఆకాష్, సందీప్ , రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
