27.7 C
Hyderabad

కొల్లూరులో దారుణ హత్య

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  : పైపులతో కొట్టి ఒకరిని హత్యచేసిన ఘటన బాన్సువాడ మండలం కొల్లూరు శివారులో చోటు చేసుకుంది. సీఐ అశోక్​ తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడ మండలం నాగారం గ్రామానికి చెందిన అమృతం విఠల్ (35) శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులతో కలిసి కొల్లూరు శివారులోని పొలంలో మద్యం సేవించారు. అనంతరం ఇద్దరు వ్యక్తులు పథకం ప్రకారం విఠల్ ను పైపులతో కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ విషయమై తమ్ముడి భార్యనే హత్య చేయించిందని మృతుడి అన్న సాయిలు ఫిర్యాదు చేశారు. దీంతో మృతుడి భార్య, మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.

More articles

Latest article