నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యారంగానికి ఈసారి బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపులో భాగంగా మొదటి దశలో శనివారం జిల్లా కేంద్రాలలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సాయంత్రం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నాయకులు పి.శంతన్, యానం విజయ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు అన్ని రంగాలతోపాటు విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తామని, విద్యకు బడ్జెట్ లో 15 శాతం నిధులు కేటాయిస్తామని ప్రకటించించారని తెలిపారు. రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని జోడొ యాత్ర సందర్భంగా హామీ ఇచ్చారని అన్నారు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాల విధానాలనే అనుసరిస్తూ విద్యారంగానికి గత సంవత్సరం బడ్జెట్లో 7.3 శాతం నిధులు మాత్రమే కేటాయించిందన్నారు. ఇందుకు సాకుగా గత ప్రభుత్వ అప్పుల కారణంగా ఆర్థిక లోటు ఏర్పడినందువలన విద్యకు తక్కువ బడ్జెట్ కేటాయించామని భవిష్యత్తులో నిధులు పెంచగలమని ప్రకటించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని ఎంత శాతం పెంచుతామని చెప్పలేదన్నారు. తమ మేనిఫెస్టోలో 15% వరకు పెంచుతామన్న వాగ్దానాన్ని కూడా తామే ఉల్లంఘిస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు సురేష్, కె.ఒమాజీ, అరవింద్, సిహెచ్ సుధాo, కే రమేష్. నాయకులు పెంటన్న, గంగయ్య, శేఖర్, బాలరాజు, పోషన్న, హాకీo, తదితరులు పాల్గొన్నారు.
