తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యారంగానికి ఈసారి బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపులో భాగంగా మొదటి దశలో శనివారం జిల్లా కేంద్రాలలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సాయంత్రం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నాయకులు పి.శంతన్, యానం విజయ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు అన్ని రంగాలతోపాటు విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తామని, విద్యకు...