24 C
Hyderabad
Sunday, August 2, 2026

పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . వర్షాకాలానికి ముందస్తు సన్నద్ధతపై ప్రజలకు అవగాహన

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ కార్పొరేటర్ ఎర్రం గంగాధర్, కో-ఆప్షన్ మెంబర్ బొబ్బిలి మాధురి అన్నారు. నగరంలోని 43వ డివిజన్‌లో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా కాలనీవాసులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధుల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు కాలనీల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కాలనీవాసులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త బొబ్బిలి మురళి, మున్సిపల్ ఏఈ భువనేశ్వర్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article