పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
. . . వర్షాకాలానికి ముందస్తు సన్నద్ధతపై ప్రజలకు అవగాహన నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ కార్పొరేటర్ ఎర్రం గంగాధర్, కో-ఆప్షన్ మెంబర్ బొబ్బిలి మాధురి అన్నారు. నగరంలోని 43వ డివిజన్‌లో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా కాలనీవాసులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధుల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు కాలనీల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు....