నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
వివేకానంద యూత్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ సభ్యులు కలిసి స్నేహ సొసైటీ, బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో తిరుగుతూ అవసరమైన వారికి ఇడ్లీలు, తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. సమాజంలో సేవాభావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు వివేకానంద యూత్ జిల్లా అధ్యక్షుడు రూపేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు, అవసరమైన వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శన్, కృష్ణ, చేతన్, భగత్, వంశీ, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
