. . . కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ రమూర్తి
బోధన్, బతుకమ్మ :
బోధన్ పట్టణం 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీ రమూర్తి వేములపల్లి కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుసుకున్నారు. స్థానిక ప్రజలతో ఆత్మీయంగా ముచ్చటించి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఓపికగా విన్న లక్ష్మీ రమూర్తి, వాటి పరిష్కారానికి తాను నిరంతరం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వార్డు అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండే పాలనను అందిస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆమె, రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో 2వ నెంబర్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.
