రుద్రూర్, బతుకమ్మ :
మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా శనివారం రుద్రూర్ మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బహిరంగ సభకు బైక్ ర్యాలీతో అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. బహిరంగ సభకు తరలి వెళ్ళిన వారిలో బీఆర్ఎస్ పార్టీ రుద్రూర్ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, నాయకులు దౌర్ సాయిలు, కొత్తపల్లి రవి కిరణ్, కర్రోళ్ల వెంకటేష్, పట్ల సాయి, శివకుమార్, బొట్టె గజేందర్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
