24 C
Hyderabad
Sunday, August 2, 2026

జీరో వడ్డీ దందాపై పోలీసుల మెరుపు దాడి

Must read

📰 Generate e-Paper Clip

  • మూడు సబ్ డివిజన్ లలో తెల్లవారుజాము నుంచే తనిఖీలు
  • వందలకొద్ది ప్రామిసరీ నోట్లు స్వాధీనం
  • 43 సెల్ డీడ్ లు సీజ్
  • కమిషనరేట్ పరిధిలో 75 లక్షల నగదు స్వాధీనం

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న జీరో వడ్డీ దందాపై కమిషనర్ సాయి చైతన్య కన్నెర్ర చేశారు. లీగల్ దందాల మాటున జరుగుతున్న వడ్డీ వ్యాపారంపై తొలిసారి మెరుపుదాడులు చేశారు. గురువారం తెల్లవారుజామున నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్ పరిధిలో వడ్డీ వ్యాపారుల ఇళ్ళ, కార్యాలయాల్లో పోలీసు శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఆయా డివిజన్ ల ఏసీపీల ఆధ్వర్యంలో అక్రమ వడ్డీ దందాపై తనిఖీలతో హడలెత్తించారు. ఇన్స్ పెక్టర్లు, ఎస్సైలు, సివిల్ పోలీసులు, ఏఆర్ సిబ్బందితో కలిసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాడులు నిర్వహించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్ ల పరిధిలో లీగల్ దందాల ముసుగులో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారుల ఇళ్ళలో తనిఖీలు నిర్వహించగా వందలకొద్ది ప్రామసరి నోట్లు, ఫైనాన్సియల్ నోట్లు పట్టుబడ్డాయి. నిజామాబాద్ సబ్ డివిజన్ లో 543 ప్రామసరి నోట్లు, 21 సెల్ డీడ్ లు, 5 బాండ్ పేపర్లు, 53.9 లక్షల నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో 4 ఫైనాన్షియల్ నోట్స్, 610 ప్రామసరి నోట్లు, 22 సెల్ డీడ్ లు, 25 బాండ్ పేపర్లు, 2 లక్షల 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.  బోధన్ సబ్ డివిజన్ లో 282 ప్రామిసరి నోట్లు, 2 వాహనాలు, 20 లక్షల 7660 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ కమిషనరేట్ ఏర్పడిన తర్వాత అతిపెద్ద రైడ్ గా చెప్పాలి. నిజామాబాద్ జిల్లాలో జీరో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతుంది. ఎలాంటి లైసెన్స్ లేకుండానే ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా వడ్డీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో నవీపేట్, నిజామాబాద్, ఆర్మూర్ కు పరిమితమైన వడ్డీ వ్యాపారం గ్రామాలకు విస్తరించింది. గ్రామాలలో మోతబరి రైతులు మొదలుకుని వడ్డీ వ్యాపారులు పేదలను, సామాన్యులను అధిక వడ్డితో దోచేస్తున్నారు. ఇటీవల ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో తనిఖీలను నిర్వహించిన పోలీసు శాఖ గురువారం మూడు సబ్ డివిజన్ లలో తనిఖీలతో వడ్డీ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

Police raid zero interest scam

  • పెద్దమనుషుల ముసుగు తొలిగేనా ..   జీరో వడ్డీల దందా బహిర్గతమయ్యేనా?

నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారం విశ్రుంకలంగా సాగుతుంది. వడ్డీ వ్యాపారం నిర్వహించాలంటే ఆర్ బిఐ నిబంధనల ప్రకారం అనుమతులు తప్పనిసరి. అంతేగాకుండా వడ్డీని ఎంత తీసుకోవాలనేది చట్టం చెబుతుంది. కానీ లైసెన్స్ లు కలిగిన ఫైనాన్షియర్ల కంటే ప్రైవేట్ వ్యాపారులే జీరో వడ్డీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా లైసెన్స్ తీసుకోకుండానే పన్నులు ఎగ్గొట్టి కోట్ట రూపాయల దందా నిర్వహిస్తూ పన్నులను చెల్లించకుండా జీరోలో దందా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ మార్కెట్ కేంద్రంగా ఒకప్పుడు ప్రామిసరినోట్లపై వ్యవసాయ పంటల కోతల దశలో వడ్డీలను వసూల్ చేసే విధంగా అప్పులు ఇచ్చేవారు. ఈ వ్యవహరం నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎన్నో రోజులుగా సాగింది. కానీ ఇప్పుడు వడ్డీ వ్యాపారాన్ని కోట్లు సంపాదించిన వైద్యులు మొదలుకుని వ్యాపారులు,  మిల్లర్లు, ఆడ్తి వ్యాపారులు, రియాల్టర్లు దందాలో తలమునకలయ్యారు. ఆరు నెలల వరకు సాధారణ వడ్డీ తర్వాత చక్రవడ్డీ గడువు దాటితే బారు వడ్డీ వసూల్ చేసే దందా నిత్యతంతుగా మారింది.

నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయం కేంద్రంగా జరిగిన వడ్డీ వ్యాపారం ఇప్పుడు పెళ్ళిళ్ళకు, పేరంటాలతో పాటు వాణిజ్య, వ్యాపారాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్ ల డెవలప్ మెంట్ కు, చదువుల కోసం అప్పులు ఇచ్చే కల్చర్ పెరిగింది. బడా వ్యాపారులు ప్రామిసరి నోట్ల కంటే సెల్ డీడ్ లను నమ్ముకుని దందా చేస్తున్నారు. ప్రధానంగా ఈ దందాలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వారే వడ్డీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వారికి పోలీసు శాఖ అండదండలు ఉండడంతో ముక్కు పిండి వసూల్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో గడిచిన ఐదేళ్ళ కాలంలో వడ్డీ వ్యాపారుల వేదింపులకు కుటుంబాలకు కుటుంబాలే బలయ్యాయి. ఆనాడు హడావుడి చేసిన పోలీసు శాఖ తర్వాత మరెప్పుడు కన్నెత్తి చూడలేదు. తాజాగా పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సాయిచైతన్య వడ్డి వ్యాపారంపై ఉక్కుపాదాన్ని మోపేందుకు సన్నద్దమయ్యారు. అయితే సెల్ డీడ్ దందా పేరిట జీరో వడ్డీ  వ్యాపారం చేస్తున్న ప్రముఖులు, పెద్ద తలకాయలు, వైద్యులు, వ్యాపారులు, కమిషన్ ఏజంట్లు, మిల్లర్లపై  చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.

Police raid zero interest scam

More articles

Latest article