29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఫామ్ హౌస్ పై   పోలీసుల దాడులు

Must read

📰 Generate e-Paper Clip

మొయినాబాద్, బతుకమ్మ :  అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నఓ ఫామ్ హౌస్ పై ఎస్ వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను అనుచరుడు పార్థసారధి జన్మదినం జరిగింది.  ఈ కార్యక్రమానికి దువ్వాడ శ్రీనివాస్ మాధురి తో పాటు 27 మంది హాజరైనట్లు సమాచారం.  పార్టీకి  అనుమతి  లేకపోవడంతో  పోలీసులు దాడి చేసి ఏడు మద్యం బాటిళ్లను,  హుక్కా ను స్వాధీనం చేసుకున్నారు. పార్థసారథి తో పాటు  ఫామ్ హౌస్ యజమాని సుభాష్ వాచ్ మన్  షేక్, హుక్కా తీసుకొచ్చిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా,  దువ్వాడ శ్రీనివాస్ మాధురి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

More articles

Latest article