24.8 C
Hyderabad
Friday, July 31, 2026

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఐదుగురు అరెస్ట్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై శనివారం పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో నగర సీఐ శ్రీనివాస్ రాజ్ ఆధ్వర్యంలో అటవీ శాఖ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఓ ఇంటిపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు విటులతో పాటు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని సదర్ హోంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరెస్టు చేసిన నలుగురు విటులతో పాటు వ్యభిచార గృహ నిర్వాహకురాలిని రిమాండ్‌కు తరలించినట్లు నగర సీఐ శ్రీనివాస్ రాజ్ వెల్లడించారు. నగరంలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

More articles

Latest article