. . . ఉమ్మడి జిల్లాలో సంచరించిన రెండు పులుల మాయం
. . . వేటగాళ్ల ఉచ్చులో చిక్కింది పెద్ద పులి ? లేక చిరుత?
. . . ఆరు నెలల క్రితం ధర్పల్లి అటవి ప్రాంతంలో చిరుతను చంపిన వేటగాళ్లు
. . . కమ్మర్ పల్లి రేంజ్ లో వన్యప్రాణుల వేట పై జోరుగా చర్చ
నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంగా సంచరిస్తున్న పెద్ధ పులుల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ఎందుకంటే మహరాష్ట్రలోని తడోబా, పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ ల అభయారణ్యాల నుంచి ఆటవీ ప్రాంతం గుండా నిజామాబాద్ జిల్లాలో ఎస్ 12, జే 1 పెద్ద పులులు ఏడాది కాలంగా గాండ్రింపులు ఉన్న విషయం విధితమే. ఉమ్మడి జిల్లాలో సంచరించిన పెద్దపులులు రెండు ఆడ పులులతో జతకట్టేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు అటు సిద్ధిపేట జిల్లా వరకు అడుగులు వేసి అంతరార్థ మయ్యాయి. గత ఎడాది మొదట మాచారెడ్డి మండలం స్టేషన్ తాండా శివారు అటవి ప్రాంతంలో పెద్దపులి ని చంపేందుకు విష ప్రయోగం తో యత్నించిన వ్యవహారం కలకలం రేపిన విషయం విధితమే. ఈ వ్యవహారంలో కొందరిపై కేసు నమోదు చేసి జైలుకు పంపిన తర్వాత ఎస్ 12 పెద్దపులి జాడ దొరకలేదు. ఈ సంవత్సరం కొత్తగా జే 1 టైగర్ రాకతో ఆటవి శాఖ దానికి సురక్షిత ప్రాంతం తరలించేందుకు ప్రయత్నిస్తున్న దాని ఆచూకీ లభించలేదు.. ఈ సమయంలో నిజామాబాద్ జిల్లాలో రెండు ప్రాంతాల్లో వణ్య ప్రాణుల వేట వ్యవహరం బెబ్బులి వేటగాళ్ల తుపాకి గుళ్ళకు బలైందా అనే చర్చ జరుగుతుంది. అటవి ప్రాంతంలో పులి కోసం అమర్చిన ట్రాప్ కేమోరాలకు మళ్లీ పులి జాడ కనిపించకుండా పోవడం ప్రధాన కారణం…

నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లి రెంజ్ పరిధిలోని భీంగల్ మండలంలోని ఓకప్పుడు దట్టమైన ఆటవికి కేరాఫ్ గా నిలిచిన దేవక్క పేట లో ఇటీవల వణ్యప్రాణుల వేట విషయంలో పలువురిని నిఘా వర్గాలు అదుపులోకి తీసుకోవడం అందుకు కారణం. కానీ ఇందల్వాయి రేంజ్ పరిధిలో ధర్పల్లి అటవి ప్రాంతంలో చిరుతను కూడా ఆరు నెలల క్రితం వేటగాళ్లు వేటాడటం తో వారు ఇచ్చిన సమాచారంతో మొత్తం 6 గురిని విచారిస్తున్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా ఈ వ్యవహరం ఇటు అటవీ శాఖకు నిఘా వర్గాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ధర్పల్లి అడవి ప్రాంతంలో చిరుతను వేటాడి దాని చర్మం వలిచారని, గోళ్లను సేకరించినట్లు ప్రాథమిక సమాచారం. అక్కడ వేటగాళ్ల ఉనికి ద్వారా కారేపల్లి, దేవక్కపేట్ ప్రాంతాల్లో పులి వేట అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులు మాత్రం కమ్మర్ పల్లి రేంజ్ పరిధిలో వన్యప్రాణుల వేట జరిగింది వాస్తవమేనని కానీ అది పెద్దపులి కాదని చిరుత అని అంటున్నారు. అక్కడ దొరికిన జంతు కళేబరం పోస్టుమార్టం చేసే, ల్యాబ్ కు పంపే ఎర్పాట్లు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. దేవక్కపేట్ అటవి ప్రాంతంలో జరిగిన జంతువుల వేటకు నాటు తుపాకీ వాడినట్లు తేలడం కలవరపాటుకు గురి చేసింది

రెండు మగ పులులు జత కోసం సాగిస్తున్న ప్రయాణం ఉమ్మడి నిజామాబాద్ ను కలవర పెడుతుంది. తెలంగాణలో ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో రెండు దశాబ్దాల క్రితం వరకు ఉన్న పెద్ద పులి జాడ అడవుల నరికివేతతో ఉనికి ప్రశ్నార్థకం మైన విషయం తెలిసిందే. పెద్దపులుల నుంచి తర్వాత జంతువులకు అలవాలమైన నిజామాబాద్ జిల్లా చిట్టడువులకు ప్రసిద్ధి. పోడు వ్యవసాయం తో అడవుల నరికివేత యదేచ్చగా సాగితే… కబ్జాల పేరిట ఆటవి విస్థిర్ణం కుంచించుకుపోయింది. పెద్దపులి తిరగిన స్థలాలకు మనుషులు వెళ్లలేని దట్టంగా ఉన్న అడవిని కలప కోసం స్మగ్లర్లు నరికివేసిన, వ్యవసాయం కోసం ఆటవి భూములు చెరబట్టడం అడవి సరిహద్దులు మాయమయ్యాయి. ఇప్పుడు అవి రికార్డులకు పరిమితం కావడంతో వన్యప్రాణుల వేట యదేచ్చగా సాగుతుంది. పులులు జీవనం కోసం అభయరణ్యాలకు వలస పోగ మరికొన్ని వేటగాళ్ల ఉచ్చుకు బలయ్యాయి అని టాక్. పులుల తర్వాత పెద్ద జంతువు గా ఉన్న చిరుతలు, మనుబోతులు, దుప్పులు, జింకలు, అడవి పందులు, ఎదులు వేట అటవి ప్రాంతంలో యదేచ్చగా సాగుతుంది. ఉమ్మడి జిల్లాలో అటవీ ప్రాంతాల్లో ఇప్పటికి వేటాడేందుకు ఎయిర్ గన్ తో పాటు నాటు తుపాకులను వాడుతారు. ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన కోందరు జిల్లాలలో దట్టమైన అటవీ ప్రాంతంలో వేటకు వచ్చి చిక్కిన సందర్భాలు ఉన్నాయి. శ్రీరాంసాగర్ పరివాహక ప్రాంతాల్లో సుమారు రెండు వేల వరకు ఉన్న బ్లాక్ బక్( చుక్కల జింకలు) ఇటివల కాలంలో వంద రెండు వందల వరకు కుచించుకు పోయాయి.గత నెలలో కామారెడ్డి జిల్లాలో నాలుగు నాటు తుపాకులు పోలీస్ శాఖ స్వాధినం చేసుకున్నారు. ఓక వ్యక్తి నాటు తుపాకీతో కాల్చుకుని ఎల్లారెడ్డి డివిజన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రతి ఆదివారం కూడా ఆటవి శివారు గ్రామాలలో వణ్య ప్రాణుల మాంసం విక్రయాలు జరుగుతున్న పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఉమ్మడి జిల్లాలో సంచరించిన పెద్ధపులులు కనిపించకుండా పోయిన తరుణంలో వన్య ప్రాణుల వేట లో వేటగాళ్ళ తుపాకి గుళ్లకు బలైంది పెద్ద పులి నా లేక చిరుత నా అనే విషయం నిఘా వర్గాలు బహిర్గతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది…
