27.3 C
Hyderabad
Friday, July 31, 2026

చండేగాం గ్రామంలో సెన్సస్ సర్వే నిర్వహించిన అధికారులు

Must read

📰 Generate e-Paper Clip

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ మండలంలోని చండేగాం గ్రామంలో శనివారం సెన్సస్ సర్వే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఇంటింటికీ తిరుగుతూ ప్రజల వివరాలను సేకరించారు. సర్వే ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు, గ్రామ ప్రజలు సర్వే అధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో అధికారి అంజయ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా సర్వే కార్యక్రమంలో భాగస్వాములై అధికారులకు సహకరించారు.

More articles

Latest article