27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

వేటగాళ్ల పై పోలీసుల ఆపరేషన్ కవచ్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 8 మంది వణ్యప్రాణుల వేటగాళ్ల ముఠా గుట్టురట్టు

. . . 5 నాటు తుపాకులు, 1 ఎయిర్ గన్ స్వాధీనం

 కామారెడ్డి / గాంధారి , బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ చట్టవ్యతిరేక అక్రమ కార్యకలాపాలు నిర్మూలనే లక్ష్యంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఆపరేషన్ కవచ్” కార్యక్రమం మరోసారి అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. అడవి లో వన్యప్రాణులను వేటాడుతున్న 8 మంది సభ్యుల ముఠాను  నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు…జిల్లా పోలీస్ బాస్ ఆదేశాలతో గాంధారి పోలీసులు  ఆపరేషన్ కవచ్ ను సక్సెస్ చేశారు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.. గురువారం జిల్లా కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర విలేఖరులతో మాట్లాడుతూ….

Police operation Kavach against poachers

ఈ నెల 24న రాత్రి గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొండి సడక్ చౌరస్తా వద్ద గాంధారి ఎస్సై మహేందర్ పోలీసు సిబ్బంది “ఆపరేషన్ కవచ్” లో భాగంగా ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు మోటార్ సైకిళ్లపై ఐదుగురు వ్యక్తులు వచ్చి పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేయడం గమనించి కొంత దూరం నుంచి వెనుదిరిగి పారిపోవడానికి ప్రయత్నించారు. గాంధారి ఎస్ఐ సిబ్బంది వెంటనే స్పందించి, అత్యంత చాకచక్యంగా వారిని వెంబడించి పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద అక్రమ నాటు తుపాకులు, గన్పౌడర్, పొటాష్, స్టీల్ పెలెట్స్ (చెర్రలు), పెల్ట్స్ తదితర ప్రమాదకర పేట సామగ్రి లభ్యమవడంతో అదేవిధంగా పట్టుబడిన వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యత గా తీసుకుని లోతైన దర్యాప్తు ప్రారంభించారు. జిల్లాలో అక్రమంగా తుపాకులు, పేలుడు పదార్థాలతో ముఠా సంచరిస్తున్న సమాచారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర సూచనల మేరకు పట్టుబడ్డ వారి యొక్క పూర్తి నెట్వర్క్ ఛేదించడానికి ఆయుధాలను రికవరీ చేయడానికి పక్కా ప్లాన్  తో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో.. సదాశివనగర్ సీఐ, గాంధారి, తాడ్వాయి ఎస్ఐ సిబ్బందితో కూడిన మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దించారు. తనిఖీలలో విస్లావత్ గోపీచంద్ నడుపుతున్న బజాజ్ మోటార్ సైకిల్ పై ఒక వ్యక్తి నాటు తుపాకీతో ఉండగా, ఆంగోతు లక్ష్మణ్ నడుపుతున్న హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్ పై విస్లావత్ నాను వేట సామాగ్రి ఉన్న సంచితో, అలాగే విస్లావత్ గణేష్ మరో నాటు తుపాకీతో ఉన్నట్లు పోలీసులు గుర్తించి స్పాట్ లోనే వారి నుండి2 నాటు తుపాకులు, సామగ్రి,2బైకులను స్వాధీనం చేసుకున్నారు. నెట్వర్క్ గురించి ఆరా తీయగా సుమారు మూడు నెలల క్రితం ఆంగోత్ ధర్మ నాయక్,  సలావత్ చందర్ ల మధ్యవర్తిత్వం, బాన్సువాడ మండలం లో చిన్న రాంపూర్ గ్రామానికి చెందిన అస్లాం చావుస్ వద్ద నుంచి ఒక్క నాటు తుపాకిని రూ.10,000 చొప్పున కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా, తాము కొనుగోలు చేసిన మొత్తం ఐదు నాటుతుపాకులలో మూడింటికి ట్రిగ్గర్ మెకానిజం లేకపోవడంతో వాటిని గండివేట్ తండా సమీపంలోని వ్యవసాయ పొలంలో దాచి పెట్టినట్లు తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు వెంటనే గండిపేట్ తండా పరిసర ప్రాంతాల్లో గాలింపు సోదాలు నిర్వహించి, అక్కడ దాచిపెట్టిన మరో 3 నాటు తుపాకులు రికవరీ చేశారు.

Police operation Kavach against poachers

ఈ కేసు దర్యాప్తును అలాగే కొనసాగిస్తూ.. ప్రత్యేక బృందాలు చిన్న రాంపూర్ గ్రామ సమీపంలోని ఒక కోళ్ల ఫారం (పౌల్ట్రీ ఫామ్) వద్ద షెల్టర్ తీసుకుని మిగతా నిందితులైన సలావత్ చందర్ , ఆంగోత్ ధర్మ నాయక్ అలియాస్ ధర్మ , ప్రధానంగా నాటు తుపాకులు సరఫరా చేసిన అస్లాం చావుస్ ను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి వేటకు ఉపయోగించే మరో 3 చాప్స్ ( బ్యారల్స్ ) ఎయిర్ గన్, 3-ట్రిగ్గర్ మెకానిజం ,స్టీల్ పెలెట్స్ (చెర్రలు) లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా అక్రమ పేట ముఠా యొక్క పూర్తి నెట్వర్క్ కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరచడం జరుగుతుందని తెలిపారు.అక్రమ ఆయుధాల సరఫరా, వన్యప్రాణుల వేట ముఠా నెట్వర్క్ ను సమర్థవంతంగా ఛేదించి, భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సంతోష్ కుమార్, గాంధారి ఎస్సై మహేందర్, తాడ్వాయి ఎస్సై నరేష్, మరియు పోలీస్ సిబ్బంది సంతోష్, పెంటయ్య, హోంగార్డు వీరప్రసాద్ లు కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించి వారికి నగదు బహుమతులు (రివార్డులు) అందజేశారు.

More articles

Latest article