27.2 C
Hyderabad

నాడు నక్సల్ కదలికలు . . . నేడు ఉమ్మడి జిల్లాలో ప్రశాంత వాతావరణం

Naxalite activities in the past... a peaceful atmosphere in the undivided district today

Must read

📰 Generate e-Paper Clip

 

 

. . . నాడు నక్సల్ ప్రభావంపై పాత జ్ఞాపకాలను గుర్తు చేసిన డిఐజి

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

సి1ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాలో నక్సల్స్ కదలికలు, మందుపాతర పేలుళ్ళు, పోలీసుల నిరంతర కవాతు, ప్రజల్లో ఆందోళనలతో ఎన్నో ఉద్రిక్తత పరిస్థితులను ఎదుర్కొందని రాష్ట్ర డీజీపీ సి.వి.ఆనంద్ అన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎస్పీగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేసిన జ్ఞాపకాలను 27 ఏళ్ళ తర్వాత గుర్తు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎస్పీగా 1996 నుంచి 1999 వరకు పని చేసిన సమయంలో ఉన్న పరిస్థితులను మీడియాతో జరిగిన సమావేశంలో గుర్తు చేశారు. ఆనాడు నిజామాబాద్ జిల్లాలో ఐదు పీపుల్స్ వార్ దళాలు ఉండేవని, నిజామాబాద్ పట్టణంతో పాటు కామారెడ్డి పట్టణంలోనూ నక్సల్స్ కదలికలు ఉండేవని గుర్తు చేశారు. ఆనాడు ప్రజాప్రతినిధులు పర్యటించాలంటే సవాళ్ళతో కూడుకునే పరిస్థితి ఉండేదని ఆనాటి పరిస్థితులను నెమరువేసుకున్నారు. రాష్ట్రంలో తొలిసారి నక్సలైట్లు క్లైమోర్ మైన్స్ ను నిజామాబాద్ జిల్లాలో వాడిన విషయాన్ని గుర్తు చేశారు. అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లు జనజీవనంలోని రావాలని వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, పునరావాసం కల్పించడంతో పాటు సమాజంలో జీవించే వసతులు కల్పిస్తున్నామన్నారు. ఒకప్పుడు అన్నల కంచుకోటలో నేడు ప్రశాంత వాతావరణం పరిస్థితులను చూసి ఆనందంగా ఉందని డీజీపీ అన్నారు. మీడియా సమావేశంలో మల్టీజోన్ జోన్ -1 ఐజీ  కార్తీకేయ, జోన్ 3 ఐజి సుంప్రీత్ సింగ్,  సిఐడి డిఐజి నారాయణ్ నాయక్,  జిల్లా ఎస్పీ  రాజేష్ చంద్ర, అధికారులు ఉన్నారు.

Naxalite activities in the past... a peaceful atmosphere in the undivided district today

. . . రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్‌కు కామారెడ్డిలో ఘన స్వాగతం

ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పోలీసు బాస్ సివి.ఆనంద్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి 5వ పోలీసు క్రీడల ముగింపు కార్యక్రమానికి డీజీపీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శుక్రవారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలో డీజీపీకి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసు వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో డీజీపీ, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జిల్లా రెవెన్యూ అధికారి పాండు తదితర అధికారులు పాల్గొన్నారు.

Naxalite activities in the past... a peaceful atmosphere in the undivided district today

More articles

Latest article