. . . ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
వెబ్ డెస్క్, బతుకమ్మ :
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఖమ్మం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామానుజవరం సమీపంలో డివైడర్ను ఢీకొని రోడ్డుపై నిలిచిపోయిన లారీని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలు కాగా బస్సు డ్రైవర్ సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రమాదంతో హైవేపై నిలిచిన వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనపై తల్లాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

