28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గాంజా వాలా అప్రోజ్ ను పట్టుకున్న పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

  • ఎస్ బి ఇన్ఫ ర్మేషన్ తో పట్టుకున్న పోలీసులు
  • రెండు వారాలుగా కోనసాగుతున్న అప్పు వేట
  •  గత వారం కంఠేశ్వర్ బైపాస్ వద్ధ రౌడిషీటర్ తో కలిసి పరారీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  పోలిస్ లకు, ఎక్సైజ్ అధికారులకు కోరకరాని కొయ్యగా మారిన గాంజావాల అప్రోజ్ అలియాస్ అప్పును ఎట్టకేలకు పోలీసు లు పట్టుకున్నారు. అది కుడా నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో గంజాయి విక్రయిస్తుండగా మునీర్ అనె మరో యువకుడితో కలిసి ఉన్నాడని స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఇచ్చిన సమాచారంతో అప్రోజ్ ను పట్టుకున్నారు. నగరంలోని ఖిల్లారోడ్డు ప్రాంతానికి చెందిన గాంజావాల అప్రోజ్ గత కొంత కాలంగా గంజాయి విక్రయాలు చేస్తు ఖిల్లా రోడ్డు మొదలుకొని బోధన్ బస్ స్టాండ్ వరకు దందా నిర్వహిస్తున్నాడు. గంజాయి దందా నిర్వహించడంతో పాటు రౌడిషీటర్ తో చెలామాణి అవుతు గ్యాంగ్ లను మెయింటేన్ చేస్తున్నాడు. రెండు వారాల క్రితం ఓ యువకుడు ఇచ్చిన ఇన్పర్మేషన్ తో అప్పు కోసం అబ్కారి శాఖ అధికారుల వేట ప్రారంభించగా కనిపించకుండా పోయాడు. అప్పడే తన స్నేహితుడైన రౌడిషీటర్ తో పాటు ఓ హత్య కేసులో వారంటు పెండింగ్ ఉన్న యువకుడితో కలిసి ఆర్మూర్ రోడ్డులో వెలుతుండగా ట్రాఫిక్ కానిస్టెబుల్ కారును ఆపివేశాడు. ఎక్కడ తన కోసం పోలిస్ లు స్కేచ్ వేశారని అనాడు కారు దిగిపారిపోయాడు అప్రోజ్. కాని కారులో కత్తులు కటార్లు ఉండటంతో పట్టుబడిన ఇద్ధరు యువకులను రూరల్ పోలిస్ లకు అప్పగించారు. అనాటి నుంచి పరారీలో ఉన్న అప్రోజ్ లోకల్ లో తిరుగుతు తప్పించుకు తిరుగుతున్నాడు. మంగళవారం ఎస్ బి అధికారులు అప్రోజ్ అనవాళ్లను రెండవ టౌన్ పోలిస్ లకు ఉప్పందించడంతో వారు మునీర్ అనే యువకుడితో కలిసి పట్టుకున్నారు.

More articles

Latest article