నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ: ధన్ పాల్ లక్ష్మీబాయ్, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని దేవి మాతల మండపాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ పట్టు చీరల పంపిణి చేశారు. మంగళవారం మార్వాడిగల్లిలోని తన నివాసంలో అర్బన్ ఎమ్మెల్యే నగరంలోని దాదాపు 250 మండపాలకు పట్టుచీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు… గత 11 ఏళ్ల నుండి తన ట్రస్ట్ ద్వారా ఈ సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. హిందూ ధర్మంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని, ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడిందని హిందూ బంధువులు అంత ఐక్యతతో, భక్తి శ్రద్దలతో నిర్వహించే దేవి నవరాత్రులకు తమ వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు .హిందూ ధర్మరక్షణకు, హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే ప్రతి కార్యానికి తన ట్రస్ట్ ద్వారా సేవాలాందించడానికి ముందుంటమన్నారు. ఈ కార్యక్రమంలో ధన్ పాల్ లక్ష్మీబాయి విట్టల్ గుప్త ట్రస్ట్ సభ్యులు, బిజెపి నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
