అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

0 1,507

రాజంపేట, బతుకమ్మ : రాజంపేట మండలంలోని గుండారం గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ యజమాని అక్రమంగా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారు అన్న సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం ఫారెస్ట్ అధికారులు ట్రాక్టర్లు పట్టుకొని కామరెడ్డి డిఎఫ్ ఓ కార్యాలయానికి తరలించినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. గత కొంతకాలంగా సదరు ట్రాక్టర్ యజమాని రాజకీయ నాయకుల అండతో ట్రాక్టర్లు టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తూ దర్జాగా వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి కొంతమంది అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తోంది.ఇదే విషయం కామారెడ్డి ఫారెస్ట్ అధికారి రమేష్ ను వివరణ కోరగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుకున్నది వాస్తవమేనని పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.