26.4 C
Hyderabad

పేకాట రాయుళ్ల అరెస్ట్ 

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్/ గాంధారి, బతుకమ్మ :  మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేగా గ్రామం లో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడులు చేశారు.  జూద స్థావరంపై దాడిలో 13 మంది పట్టుబడగా, 9 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి, రూ.25,240నగదు స్వాధీనం చేసుకున్నారు. గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో
గాంధారిలో జూద స్థావరంపై  దాడిలో 6 మంది పట్టుబడగా, 5 మొబైల్ ఫోన్లు, రూ.8,490 స్వాధీనం చేసుకున్నారు. రెండు గేమింగ్ యాక్ట్ కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, తెలిపారు. జూదం చట్టవిరుద్ధం అని, పేకాట ఆడేవారిపై, నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  జూద నిర్మూలనకు పోలీస్ చర్యలు నిరంతరం కొనసాగుతాయి అని తెలిపారు.

More articles

Latest article