వర్ని, బతుకమ్మ :
బాన్సువాడ నియోజక వర్గం వర్ని మండలం లోని నెహ్రూ నగర్ గ్రామంలో ఎస్డీఎఫ్నిధులు 30 లక్షలతో నిర్మించిన జనరల్ ఫంక్షన్ హాల్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్నిధులు 40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ లను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

అనంతరం వర్ని జనరల్ ఫంక్షన్ హాల్ లో వర్ని మండలం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ 27 మంది లబ్ధిదారులకు 27,03,132/- రూపాయల చెక్కులను, రుద్రూర్ మండలం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ 21 మంది లబ్ధిదారులకు 21,02,436/- రూపాయల చెక్కులను మొత్తం 48 మంది లబ్ధిదారులకు 48,05,568/- రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వర్ని, రుద్రూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

