ఎల్లారెడ్డి, బతుకమ్మ :
తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం వ్యాప్తంగా కాస్ట్రో ఆయిల్ వారు రూపొందించిన లక్కీ డ్రా లో ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ద్విచక్ర వాహన మెకానిక్ కు అదృష్టం వరించింది.గత కొన్ని సంవత్సరాలుగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ద్విచక్ర వాహన మెకానిక్ గా కొనసాగుతున్న మద్దిబోయిన కృష్ణమూర్తికి కంపెనీ బంపర్ ఆఫర్ వరించింది శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ప్రముఖ ట్రాక్టర్ షోరూమ్ వద్ద ఏర్పాటు చేసిన కాస్ట్ ఆయిల్ మెకానికులు, ఆటో మొబైల్ షాపు యజమానులతో కంపెనీ ప్రతినిధులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కాస్ట్రో ఆయిల్ సేల్స్ పై కూపన్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఐదుగురికి మాత్రమే బహుమతులు అందాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన కృష్ణ బైక్ మెకానిక్, ఆటోమొబైల్ రంగానికి ఈ అదృష్టం భరించిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం కూపన్ల డ్రాలో ఎల్లారెడ్డి లోని మెకానిక్ బుల్లెట్ బహుమతిగా అందిందని వారు తెలిపారు. అనంతరం విజేత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బుల్లెట్ (హంటర్) వారికి అందజేశారు. అనంతరం స్వీట్లు పంచుతూ ఆనందాన్ని పలువురు మెకానికులతో పాటు కంపెనీ ప్రతినిధులు పంచుకున్నారు.
