- యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనహృదయ నేత అని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ భవన్ లో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విపుల్ గౌడ్ మాట్లాడుతూ పిసిసి పగ్గాలు చేపట్టిన అనతి కాలంలోనే రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడమే కాకుండా సమర్థవంతంగా పాలన నడిపిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేరుస్తూ జనహృదయనేతగా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని అన్నారు. గత పాలనలో అప్పుల కుప్ప గా మార్చిన రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి అహర్నిశలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని యూత్ కాంగ్రెస్ పక్షాన కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ రాజు, జండా బాలాజీ గుడి చైర్మన్ ప్రమోద్, విజయ్ పాల్ రెడ్డి, జై గౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శులు నరేందర్ గౌడ్, ఆదిత్య పాటిల్, ఇర్ఫాన్, ఆకాష్ రెడ్డి, సంజీవ్, శుభం, నిజామాబాద్ రూరల్ ప్రెసిడెంట్ ఏశాల మహీందర్, నవీన్ రెడ్డి, శ్రీను,నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

