25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కోర్టు కానిస్టేబుల్ సస్పెన్షన్

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పీఎస్ లో కోర్టు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బుక్యా శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 6న బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 9 మందిని పట్టుకున్నారు. వారిపై గాంబ్లింగ్ కేసు నమోదు చేసి కోర్టులో హజరు పరిచారు. న్యాయస్థానం విధించిన జరిమానా కంటే అదనంగా కోర్టు కానిస్టేబుల్ బుక్యా శ్రీనివాస్ వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దానితో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అంతర్గతంగా విచారణ జరిపి కానిస్టేబుల్ అదనపు వసూళ్లు వాస్తవమేనని గుర్తించి సస్పెన్షన్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు.

More articles

Latest article