24.7 C
Hyderabad
Monday, August 3, 2026

పెండింగ్ ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పీడీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్.బాల్ రాజ్

 

బోధన్, బతుకమ్మ :

 

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఫ్రంట్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్.బాల్ రాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బోధన్ ఆర్డీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలోని విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన సుమారు రూ.11,500 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలువురు ఉన్నత విద్యను కొనసాగించలేని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న అనేక మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక తమ విద్యా సర్టిఫికెట్లను పొందలేకపోతున్నారని, దీంతో వారి విద్యాభవిష్యత్‌ అనిశ్చితిలో పడిందన్నారు. మరోవైపు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు బకాయిలు సంవత్సరాలుగా అందకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. దేశ అభివృద్ధికి విద్య కీలకమని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని పీడీఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ఎఫ్ డివిజన్ నాయకులు శేఖర్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article