24.1 C
Hyderabad
Monday, August 3, 2026

అంతర్ రాష్ట్ర దొంగల ముఠాపై పీడీ ఆక్ట్ అమలు

Must read

📰 Generate e-Paper Clip

  • సంవత్సరం పాటు బెయిల్ లేకుండా జైలుకే పరిమితం
  • కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర

 

కామారెడ్డి,  బతుకమ్మ : జాతీయ రహదారులపై దొంగతనాలు, దారి దోపిడీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాపై పీడీ ఆక్ట్ అమలు చేసి సంవత్సరం పాటు బెయిల్ లేకుండా జైలుకే పరిమితం చేస్తామని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో రహదారులపై వాహనదారులను లక్ష్యంగా చేసుకుని మారణాయుదాలతో దాడులు చేసి దోపిడీలు చేయడం, గ్రామాలలో తాళాలు వేసి ఉన్నఇళ్లలో దొంగతనాలు చేసి ఇంట్లో ఉన్న వారిపై దాడి చేసిన అంతర్ రాష్ట్ర పార్థీ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులపై పీడీ యాక్టు అమలు చేసినట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో గల ఔరాద్ గ్రామానికి చెందిన క్రిష్ణ బాబు షిండే, మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాలోని మంగ్యాల్ తడాకు చెందిన నాందేవ్, వసూర్ గ్రామానికి చెందిన రాథోడ్ అజిత్ రామేశ్ లపై పీడీ యాక్టు ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులు ప్రస్తుతం నిజామాబాద్ సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన పీడీ యాక్టు ఉత్తర్వులను సదాశివ నగర్ సీఐ సంతోష్ కుమార్, గాంధారి ఎస్ఐ ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ వి.ఎల్.నర్సింలు గురువారం ముగ్గురు నిందితులకు నిజామాబాద్ సెంట్రల్ జైలులో అందజేశారని తెలిపారు. ఎవరైనా తరచూ నేరాలకు పాల్పడుతూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పూర్తిగా జైలు జీవితానికే పరిమితం అయ్యే అవకాశం ఉందన్నారు.

More articles

Latest article